: నేను ఐ ఫోన్ వాడలేను: ఒబామా


యాపిల్ ఐ ఫోన్ అంటే మోజు పడని వారెవరు ఉంటారు? అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా ఇందుకు అతీతులు కాదు. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా తన దగ్గర యాపిల్ ఐ ఫోన్ ఉంచుకోవడం కుదరదని ఒబామా అంటున్నారు. తన కూతుర్లు షాషా, మాలియా ఇద్దరూ ఐఫోన్ తోనే ఎక్కువ సమయం గడుపుతుంటారని చెప్పారు. తాను ప్రతిపాదిస్తున్న నూతన ఆరోగ్య బిల్లుపై ప్రచారంలో భాగంగా నిన్న వైట్ హౌస్ లో ఒబామా ఒక యూత్ కార్యక్రమం నిర్వహించారు. కేబుల్ బిల్లు, ఫోన్ బిల్లు కోసం నెలకు 100 డాలర్లకు పైనే చెల్లిస్తుంటారని.. దీనికంటే తక్కువ ఖర్చుకే ఆరోగ్య భద్రత అందుబాటులోకి వస్తోందని చెప్పారు.

  • Loading...

More Telugu News