: ఈ రోజు కూడా టేబుల్ ఐటెంగానే తెలంగాణ ముసాయిదా బిల్లు
రాష్ట్ర విభజనకు సంబంధించి ఈ రోజు జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశం అత్యంత కీలకమైనది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జరగనున్న కేబినెట్ భేటీలో తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ సమావేశం అజెండాలో తెలంగాణ బిల్లును చేర్చలేదు. దీంతో, గతంలో మాదిరిగానే ఈ రోజు కూడా టీబిల్లు టేబుల్ ఐటెంగానే కేబినెట్ ముందుకు రానుంది. చివరి క్షణం వరకు విభజనపై జీవోఎం కసరత్తు చేయడంతో, ప్రధానమంత్రికి బిల్లును సమర్పించలేదని, అందుకే బిల్లును అజెండాలో చేర్చలేదని ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి.