: నేటి నుంచే పార్లమెంటు సమావేశాలు.. తెలంగాణ బిల్లు వస్తుందా?


మరికాసేపట్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు ఈ నెల 20 వరకు కొనసాగుతాయి. ఆదివారాలు, పండుగలు మినహాయిస్తే మొత్తం 12 రోజుల పాటు సభ కొనసాగనుంది. ఇంత తక్కువ సమయంలోనే దాదాపు 35 బిల్లులతో పాటు, ఎన్నో ముఖ్యమైన పద్దులకు సభ ఆమోదముద్ర పొందాల్సి ఉంది. ఈ బిల్లులలో మహిళా, లోక్ పాల్ బిల్లులు అత్యధిక ప్రాధాన్యం కలిగిఉన్నాయి. మరో వైపు తెలంగాణ బిల్లు ఈ సమావేశాల్లో సభకు వస్తుందా? రాదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొని ఉంది.

ఈ రోజు మాదకద్రవ్యాల నియంత్రణ, మత ఘర్షణల నిరోధక బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ రోజు ఎంపీలు మోహన్ సింగ్ (ఎస్పీ), మురారీ లాల్ సింగ్ (బీజేపీ)ల మృతికి సంతాపం తెలిపిన అనంతరం సభను రేపటికి వాయిదా వేసే అవకాశం కూడా ఉంది. శని, ఆదివారాలు సెలవు కాబట్టి సోమవారం నుంచి సభ పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News