: పొడిదగ్గుకు చక్కటి వైద్యం
మంచు కురిసే ఈ కాలంలో ఎక్కువగా వేధించే సమస్యల్లో ఒకటి పొడిదగ్గు. చాలామందిని ఈ పొడిదగ్గు వేధిస్తుంటుంది. ఇలాంటి వారికి చక్కటి ఔషధం ఇంగువ. శీతాకాలంలో వేధించే పలు రకాల దగ్గులకు ఇంగువ చక్కటి నివారణిగా పనిచేస్తుంది. పొడిదగ్గుతో బాధపడేవారు అర టీస్పూను ఇంగువ పొడి, ఒక టీస్పూను తాజా అల్లం రసం, ఒక టేబుల్‌స్పూను తేనె కలిపి తీసుకోవాలి. రోజుకు ఒకసారి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. దీన్ని నోటిలో ఉంచుకుని నెమ్మదిగా మింగడం వల్ల గొంతు గరగర పోయి పొడిదగ్గు తగ్గుతుంది.
అలాగే శ్లేష్మంతో కూడిన దగ్గు వస్తుంటే అర టీస్పూను ఇంగువ పొడి, అర టీస్పూను శొంఠిపొడి, రెండు స్పూన్ల తేనె కలిపి దీన్ని ఒక టాఫీలాగా తయారుచేయాలి. దీన్ని నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ రసాన్ని మింగితే దగ్గు క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. ఈ టాఫీలను రోజుకు రెండు మూడుసార్లు వాడితే దగ్గు బాగా తగ్గుతుంది. అలాగే ఈ సీజన్‌లో మనల్ని ఇబ్బంది పెట్టేవాటిలో జలుబు కూడా ఒకటి. జలుబు తగ్గడానికి కొన్ని చుక్కల ఇంగువ నూనెను వేడి నీళ్లలో వేసి ఆవిరి పడితే జలుబు తగ్గుతుంది. ఇంగువ నూనెను ఛాతీ, గొంతు, వీపు భాగాల్లో రాసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది.