: అన్ని మతాలు, సిద్దాంతాల కన్న దేశమే మిన్న: మోడీ
అన్ని మతాలు, సిద్దాంతాల కన్న దేశమే మిన్న అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లౌకికవాదమంటే దేశానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడమేనని సరికొత్త భాష్యం చెప్పారు. మోడీ నిన్న 'ఇండియన్ డయాస్పోరా' కార్యక్రమంలో వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
అమెరికా వెళ్ళడానికి మోడీకి ఆ దేశం వీసా మంజూరు చేయకపోవడంతో, అమెరికాలో ఉంటున్న భారతీయులను ఉద్దేశించి ఆయన భారత్ నుంచే తన ప్రసంగాన్ని వినిపించారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ అమెరికా.. మోడీకి వీసా తిరస్కరించింది.
కాగా, తన ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎప్పుడూ దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని, దేశం తర్వాతే మతం, సిద్ధాంతం వంటి విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.