: ఈ 'రిస్టిఫై' శరీర ఉష్ణోగ్రతను నిలకడగా ఉంచుతుంది


మనం సాధారణంగా వాతావరణం చల్లగా ఉంటే రూమ్ హీటర్లను, వేడిగా ఉంటే ఏసీలు, కూలర్లను వాడుతుంటాం. అయితే ఒకే పరికరం ఈ రెండింటికీ ఉపయోగపడే విధంగా మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెందిన నలుగురు శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పరికరానికి వారు రిస్టిఫై అని నామకరణం చేశారు. చేతి గడియారం మాదిరిగా ఉండే దీన్ని ధరిస్తే ఇది గది ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా మణికట్టులోని నాడికి ఉష్ణోగ్రతను అందించే తరంగాలను పంపిస్తుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత సమతుల్యం అవుతుంది. సెల్ ఫోన్ల లో వాడే బ్యాటరీతో పనిచేసే ఈ పరికరానికి ఒక్కసారి చార్జింగ్ చేస్తే రోజంతా పనిచేస్తుందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News