: ‘కింగ్’ గురించి తెలిసిపోయింది
కింగ్ అంటే రాజు... కింగ్ కోబ్రా అంటే పాముల్లో రాజు వంటిది. భారతదేశంలో, ఆగ్నేయాసియాలోను ఎక్కువగా కనిపించే పాము రకాల్లో కింగ్ కోబ్రా ప్రధానమైంది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముగా గుర్తింపు పొందిన రాచనాగు కింగ్ కోబ్రా. ఈ పాము చాలా పొడవుగా పెరుగుతుంది. దాదాపుగా 18.5 అడుగుల పొడవు పెరిగే ఈ పాము ఎందుకు అంత విషపూరితమైందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు. ఈ నేపధ్యంలో లివర్‌పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు ఈ పాముయొక్క జన్యుక్రమాన్ని గుర్తించారు. తాము కనుగొన్న కింగ్‌కోబ్రా జన్యుక్రమంతో ఈ పాము ఎందుకంత విషపూరితమైందో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.