: ఐదు గ్రహాల్లో నీటి ఆనవాలు


ఈ సువిశాల విశ్వంలో ఒక్క భూగ్రహం మినహా మిగిలిన గ్రహాల్లో నీటి జాడలు దాదాపుగా లేవనే ఇంతకాలం శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. అసలు ఎక్కడైనా నీరు ఉండే అవకాశం ఉందా? అనే దిశగా కూడా ప్రయోగాలు చేస్తూవున్నారు. ఈ నేపధ్యంలో అంతరిక్షంలో ఐదు గ్రహాల్లో నీటి వనరులు ఉన్న జాడ తెలిసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన శాస్త్రవేత్తలు సౌరకుటుంబానికి వెలుపలగా ఉన్న ఐదు గ్రహాల్లో నీటి వనరులు ఉన్న జాడ తెలిసిందని ప్రకటించారు. గతంలో నీటి జాడలు ఉన్న గ్రహాల గురించి తెలిసినా, వాటి గురించి కచ్చితంగా తేల్చి చెప్పలేకపోయారని, అయితే తాము గుర్తించిన ఐదు గ్రహాల్లో నీటి వనరుల ఉనికి గురించి కచ్చితమైన సమాచారం ఉందని నాసాకు చెందిన శాస్త్రవేత్త అవీమాండెల్‌ చెబుతున్నారు. ఈ ఐదింటిలో వాస్ప్‌`17బి, హెచ్‌డీ 209458 అనే రెండు గ్రహాల్లో నీటి జాడలు మరింత అధికంగా ఉన్నట్టు అవీమాండెల్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News