: ఢిల్లీ శ్రీరామ్ ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవానికి ప్రధానికి ఆహ్వానం


ఢిల్లీలోని ప్రముఖ శ్రీరామ్ ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవానికి అతిధిగా హాజరు కావాలంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆహ్వానం అందింది. కొద్ది రోజుల్లో జరగనున్నఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా ప్రధానిని కలిసి ఆహ్వానించామని కళాశాల ప్రిన్సిపాల్ పీసీ జైన్ విలేకరులకు వెల్లడించారు. 

అయితే ప్రధాని నుంచి ఎలాంటి సమాధానం రాలేదని.. ఆయన స్పందన కోసం తాము ఎదురుచూస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల్లో తీరిక లేకుండా ఉన్న మన్మోహన్ కొన్ని రోజుల్లో ఏదో ఒక తేదీని ఖరారు చేస్తారని కళాశాల యాజమాన్యం భావిస్తోంది. ఇదే కళాశాలలో జనవరిలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించిన విషయం తెలిసిందే!

  • Loading...

More Telugu News