: రేపు యధావిధిగా నడవనున్న ఎంఎంటీఎస్ రైళ్లు
హైదరాబాదులో రేపు ఎంఎంటీఎస్ రైళ్లు యధావిధిగా నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. గురువారం టీఆర్ఎస్, టీ-జేఏసీ బంద్ కు పిలుపునిచ్చిన విషయం విదితమే. రేపటి బంద్ కు ఆర్టీసీ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో ప్రయాణీకుల సౌకర్యార్థం హైదరాబాద్ లోకల్ రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు చెప్పారు.