: బొత్స ఆరోగ్యం నిలకడగా ఉంది: కేర్ వైద్యులు
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని హైదరాబాదులోని కేర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన బీపీ అదుపులోనే ఉందని, రేపు ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిప్ట్ చేస్తామని పేర్కొన్నారు. అస్వస్థత కారణంగా నిన్న కేర్ లో చేరిన బొత్సకు వైద్యులు పలు రకాల పరీక్షలు చేసిన సంగతి తెలిసిందే.