: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ పూర్తి
న్యూఢిల్లీ శాసన సభ ఎన్నికలకు పోలింగ్ పూర్తయింది. గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగిందని, 74 శాతం వరకు పోలింగ్ నమోదు అయినట్లు సమాచారం. ఆర్.కె.పురంలో అయితే 80 శాతం వరకు పోలింగ్ జరిగిందని అంచనా. అక్కడక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు మొరాయించినట్లు వార్తలొచ్చాయి. మధ్యాహ్నం వరకు 116 ఈవీఎం లను మార్చామని ఎన్నికల అధికారులు తెలిపారు.