: సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే గంగూలీపై ఎఫ్ఐఆర్


ఓ మహిళా న్యాయవాదిపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే గంగూలీపై కోల్ కతా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. భారత్ బచావో సంగతన్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ కొన్ని రోజుల కిందట గంగూలీపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేగాక ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కోల్ కతా హెచ్ఆర్సీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News