: విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయ్...


విద్యుత్ వినియోగదారులపై మొత్తం రూ. 9,339 కోట్ల భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. యూనిట్ కు 50 పైసల నుంచి రూపాయి వరకు పెంచడానికి సన్నాహకాలు మొదలయ్యాయి. విద్యుత్ పంపిణీ సంస్థ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఈ రోజు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించింది.

150 యూనిట్ల వరకు వాడుకునే గృహ వినియోగదారులకు యూనిట్ కు 50 పైసలు, కమర్షియల్ కేటగిరీలో చిన్న పరిశ్రమలకు యూనిట్ కు రూపాయి పెంచనున్నారు. ఇక కస్టమర్ ఛార్జీలు 5 నుంచి 20 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News