: నాలుగు రాష్ట్రాల ఫలితాల తర్వాత కేంద్రం దూకుడుకు కళ్లెం పడుతుంది: లగడపాటి
నాలుగు రాష్ట్రాలకు జరుగుతున్న శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం దూకుడుకు కళ్లెం పడుతుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు సమైక్యవాదులకు ఊరటనిస్తాయని తెలిపారు. కాంగ్రెస్ వాదిగా తనకు ఇది రుచించనప్పటికీ రానున్న రోజుల్లో ఇదే జరగబోతోందని అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో లగడపాటి ఈ వ్యాఖ్యలు చేశారు. దత్తపుత్రుడు, వేర్పాటువాద పుత్రుడిపై ఆధారపడితే... కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ అంశాన్ని కేంద్రం అంత సులువుగా ముందుకు తీసుకెళ్లలేదని అన్నారు. రాష్ట్ర సమైక్యతను కాపేండేందుకు కావాల్సిన అస్త్రాలన్నీ తమ వద్ద ఉన్నాయని లగడపాటి స్పష్టం చేశారు. సొంత బలంతో బిల్లును పాస్ చేయాలే కానీ, పక్కవారి సపోర్ట్ తో కాదని ఎద్దేవా చేశారు.