: జేడీయూ నేత హత్య కేసులో ఆర్జేడీ మాజీ ఎంపీకు జీవితకాల శిక్ష
బీహార్ కు చెందిన జేడీయూ నేత సత్యేంద్ర సింగ్ హత్య కేసులో ఆర్జేడీ మాజీ ఎంపీ విజయ్ కృష్ణ, మరో ముగ్గురికి పాట్నా జిల్లా కోర్టు ఈ రోజు జీవితకాల శిక్ష విధించింది. అంతేగాక ఎంపీకు, ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న ఆయన కుమారుడు చాణక్య సింగ్ కు కోర్టు రూ.30వేలు, రూ.35వేల చొప్పున పెనాల్టీ కూడా విధించింది. ఈ కేసులో నిందితులైన మరో ఇద్దరు (ఎంపీ సర్వెంట్లు)కి ఒక్కొక్కరికి ఆరువేల రూపాయల పెనాల్టీ విధించింది. 2009లో జరిగిన జేడీయూ నేత హత్య కేసు బీహార్ లో సంచలనం సృష్టించింది.