: 'తెహల్కా' మాజీ మేనేజింగ్ డైరెక్టర్ కు సమన్లు
'తెహల్కా' మాజీ మేనేజింగ్ డైరెక్టర్ షోమా చౌదరికి ఐపీసీ సెక్షన్ 164 కింద గోవా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆమెతో పాటు మరో ముగ్గురికి కూడా సమన్లు అందాయి. సంస్థ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ లైంగిక వేధింపుల కేసులో షోమా చౌదరి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ఎదుట రికార్డు చేయాలని ఆదేశించారు.