: ఈఆర్ సీ ముందుకు విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు
2014-15లో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్ సీ (ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్)కి సమర్పించాయి. 2014-15లో డిస్కంల వార్షిక రుణ అవసరాలు రూ.52,753 కోట్లుగా ఉందని, డిస్కంల వార్షిక అంచనా రూ.36,345 కోట్లుగా ఉందని పేర్కొన్నాయి. ఇక అదే ఏడాదిలో రాష్ట్రంలోని నాలుగు డిస్కంల రెవెన్యూ లోటు రూ.16,409 కోట్లని చెప్పింది. విద్యుత్ అవసరాలు 99,046 మిలియన్ యూనిట్లుగా ఉందని, విద్యుత్ అందుబాటు 85వేల 582 మిలియన్ యూనిట్లని వివరించింది. దాంతో, 13,464 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉందని చెప్పింది.