: కమిషన్లకు కక్కుర్తిపడి వైఎస్ మిగులు జలాలు వద్దన్నారు: గాలి
కమిషన్లకు కక్కుర్తిపడి వైయస్ రాజశేఖరరెడ్డి మిగులు జలాలు వద్దని లేఖ రాశారని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలిపారు. అప్పట్లో వైఎస్ ఇచ్చిన లేఖ వల్లే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నెలకొందన్న విషయం ప్రజలకు తెలుసని ఆయన చెప్పారు. హైదరాబాద్ లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఓట్ల కోసం జగన్ నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు.