: వేలానికి జాక్సన్ వస్తువులు
దివంగత పాప్ రారాజు మైకేల్ జాక్సన్ ఉపయోగించిన బిల్లీ జీన్ గ్లోవ్స్, షూలు ఈ వారంలో లాస్ ఏంజెలెస్ లో వేలానికి రానున్నాయి. అలాగే, స్వరోస్కి జాకెట్ ను కూడా వేలం వేయనున్నారు. దీనికి 2కోట్ల రూపాయలు వస్తాయని అంచనా. 1986లో గ్రామీ అవార్డుల సందర్భంగా జాక్సన్ ధరించిన విట్నే హూస్టన్స్ డ్రెస్ 3లక్షల రూపాయలు పలుకుతుందని భావిస్తున్నారు.