: అమెరికాలో ఉండేందుకు ఒబామా బాబాయికి అనుమతి


అమెరికాలో నివసించేదుకు ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా బాబాయి ఒన్యాంగో ఒబామా(69)కు బోస్టన్ కోర్టు అనుమతి జారీ చేసింది. అదేంటీ, అధ్యక్షుడి బాబాయి అమెరికాలో ఉండడానికి అనుమతి ఎందుకు అనుకుంటున్నారా..? ఒన్యాంగో కెన్యాలో జన్మించారు. 1963లో అమెరికాకు వలస వచ్చారు. వాస్తవానికి 1992లో అమెరికాను విడిచి వెళ్లిపోవాల్సి ఉంది. కానీ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఆయన అక్కడే ఉంటున్నారు. దీంతో అధికారులు ఆయనపై కేసు పెట్టారు. కెన్యాలో జన్మించిన ఒన్యాంగో గత 50 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తూ ఉండడం, కష్డపడి పని చేసేవాడు కావడం, ఆదాయపన్ను కూడా చెల్లిస్తూ ఉండడంతో అమెరికాలోనే ఉండేందుకు జడ్జి అనుమతించారు.

  • Loading...

More Telugu News