: పులిచింతలలో విజయమ్మ దీక్ష
రాష్ట్ర రైతుల పాలిట శాపంగా పరిణమించనున్న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుకు నిరసనగా వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా పులిచింతల చేరుకున్న వైఎస్ విజయమ్మ తమ పార్టీ మద్దతుదారులతో కలిసి నేడు పులిచింతలలో దీక్ష చేస్తున్నారు. రేపు వైఎస్సార్ కడప జిల్లా గండికోట ప్రాజెక్టు పరిధిలో దీక్ష చేయనున్నారు. ఎల్లుండి మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు దగ్గర దీక్షకు ఉపక్రమించనున్నారు.