: సర్వభూపాల సేవలో శ్రీకృష్ణ రూపంలో దర్శనమిచ్చిన పద్మావతి అమ్మవారు


చిత్తూరు జిల్లా తిరుచానూరులో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఆరవ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం సర్వ భూపాల వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. శ్రీకృష్ణ రూపంలో ఆసీనురాలైన అమ్మవారు సర్వభూపాల వాహనంపై తిరువీధుల్లో విహరించారు. నేటి సాయంత్రం అమ్మవారి స్వర్ణ రథోత్సవం జరుగనుంది. శ్రీ మహాలక్ష్మి రూపంలో స్వర్ణాలంకర భూషితురాలై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. రాత్రికి గరుడ వాహన సేవ జరుగనుంది. ఈ బ్రహ్మోత్సవాలు మరో మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి.

  • Loading...

More Telugu News