: అవకాశం వస్తే టీమిండియాకు కోచ్ గా పనిచేస్తా: అజహరుద్దీన్


అవకాశం వస్తే భారత క్రికెట్ జట్టుకు కోచ్ గా పనిచేస్తానంటున్నాడు భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్. లండన్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అజహర్ ఈ సందర్బంగా తన మనసులోని కోరికను వెల్లడించాడు. బీసీసీఐ తనకా పదవిని ఇస్తే టీమిండియాకు భవిష్యత్తులో కోచ్ నవుతానని తెలిపాడు. క్రికెట్ ఆడడం ద్వారా ఎంతో నేర్చుకున్నాననీ, ఆ నైపుణ్యాన్ని యువ ఆటగాళ్లకు నేర్పాలనివుందనీ ఈ మాజీ కెప్టెన్ చెప్పాడు. అయితే భారత జట్టుకు ఎవరు కోచింగ్ ఇవ్వాలో నిర్ణయించే అధికారం మాత్రం బీసీసీఐ దేనని అన్నాడు. భారత క్రికెట్ కు సేవ చేయడానికి తాను ఏ పదవికైనా సిద్ధమేనని అజహర్ పేర్కొన్నాడు. 

  • Loading...

More Telugu News