: సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ ఏకే గంగూలీ రాజీనామాకు పెరుగుతున్న ఒత్తిడి
ఓ మహిళా న్యాయవాదిపై హోటల్ రూంలో లైంగిక దాడికి పాల్పడిన వ్యవహారంలో నిందితుడిగా ఉన్న సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే గంగూలీ రాజీనామాకు తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం ఆయన పశ్చిమబెంగాల్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ ఉన్నారు. ఈ క్రమంలో పానల్ నుంచి గంగూలీ తక్షణమే రాజీనామా చేయాలని తృణమూల్ డిమాండ్ చేసింది.