: హైదరాబాద్ పై గవర్నర్ అజమాయిషీని అంగీకరించం: కోదండరాం


రేపట్నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో టీజేఏసీ స్టీరింగ్ కమిటీ ముగిసిన అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. 10 జిల్లాలు, హైదరాబాద్ తో కూడిన సంపూర్ణ తెలంగాణనే తామందరం కోరుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. హైదరాబాద్ పై గవర్నర్ అజమాయిషీని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్పష్టం చేశారు.

తెలంగాణ ఏర్పడేవరకు అందరూ సమైక్యంగా ఉండాలని కోదండరాం కోరారు. రేపటి తెలంగాణ బంద్ కు తెలంగాణ రాజకీయ జేఏసీ మద్దతు పలుకుతోందని తెలిపారు. బంద్ ను అందరు కలసి విజయవంతం చేయాలని కోరుతున్నామని అన్నారు. రేపటి బంద్ కు సీపీఐ న్యూ డెమోక్రసీ ఇప్పటికే మద్దతు ప్రకటించిందని చెప్పారు. బీజేపీ కూడా మద్దతు ఇస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News