: 40 శాతం పురుషులు శృంగారంలో నియంతలే!
ప్రతీ ఐదుగురు పురుషుల్లో ఇద్దరు మోటు సరసులే. శృంగారం విషయంలో వీరు భాగస్వామి ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా నియంతల్లా వ్యవహరిస్తారని ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది. మరింత బలిష్టులై, ఫురుషాధిక్య ధోరణి ఉన్నవారైతే మూడు రెట్లు అధికంగా భాగస్వాములను వేధిస్తారని తేలింది. అలాగే కొడుకునే కనాలని కూడా నిర్దేశిస్తారట. ఇలాంటి వారు ఉత్తరప్రదేశ్ లో 64 శాతం ఉంటే, రాజస్థాన్ లో 22 శాతం, మహారాష్ట్రలో 25 శాతం ఉన్నట్లు 'ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్' ఏడు భారతీయ రాష్ట్రాలలో ఈ అధ్యయనం నిర్వహించి తెలియజేసింది. అయితే మగవారిని అందరినీ ఒకే గాటన కట్టరాదంటూ.. వారిని నాలుగు రకాలుగా వర్గీకరించింది.