: మోడీకి థరూర్ శ్రీమతి సునంద మద్దతు


గుజరాత్ ముఖ్యమంత్రి మోడీకి.. ఆర్టికల్ 370 విషయంలో కేంద్ర మంత్రి శశిథరూర్ శ్రీమతి సునంద పుష్కర్ మద్దతు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370పై పునరాలోచించాలని.. ఇది మహిళలపై వివక్ష చూపుతోందని పుష్కర్ అన్నారు. ఇందుకు ఆమె ఒక ఉదాహరణ కూడా చెప్పారు. 'కాశ్మీరేతర వ్యక్తులను పెళ్లిచేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలను పొందలేకున్నామని అక్కడి నా స్నేహితురాళ్లు కొందరు చెప్పారు. అయితే, కాశ్మీర్ అబ్బాయిలను పెళ్లి చేసుకున్న కాశ్మీరేతర అమ్మాయిలు మాత్రం ఉద్యోగాలు పొందుతున్నారు. వారి పిల్లలు కూడా అన్ని రకాల హక్కులకు అర్హత సాధిస్తున్నారు' అంటూ వివరించారు.

  • Loading...

More Telugu News