: సచిన్ కు భారతరత్న ఇవ్వడం తప్పుకాదు: ఈసీ
సచిన్ టెండుల్కర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వడం ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించడం కిందకు రాదని ఎలక్షన్ కమిషన్(ఈసీ) స్పష్టం చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు వీలుగా కేంద్రం సచిన్ కు భారతరత్న ప్రకటించిందని.. ఇది ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించడం అవుతుందని సమాచార హక్కు కార్యకర్త ఆశిష్ భట్టాచార్య లోగడ ఈసీకి ఫిర్యాదు చేశారు.
దీన్ని ఈసీ మంగళవారం కొట్టివేసింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వ సాధారణ పాలన నిలిచిపోరాదని పేర్కొంది. భారతరత్న పురస్కారాన్ని ఎన్నికలు జరగని రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు ఇవ్వడం నిబంధనలకు వ్యతిరేకం కాదని ఈసీ స్పష్టం చేసింది.