: ప్రారంభమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటలవరకు కొనసాగుతుంది. 1.19 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 810 మంది అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది. తొలిసారి త్రిముఖ పోటీ ఏర్పడటంతో, ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.