: పార్కిన్సన్స్‌ను అడ్డుకోవచ్చు!


నాడీకణజాలాలు చనిపోవడం ద్వారా వచ్చే వ్యాధి పార్కిన్సన్స్‌. ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి తగు ఔషధాలను తయారుచేయడానికి శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరకమైన ప్రోటీనును అడ్డుకోవడం వల్ల పార్కిన్సన్స్‌ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని పరిశోధకుల అధ్యయనంలో తేలింది.

యూనివర్సిటీ ఆఫ్‌ షెఫీల్డ్స్‌ కు చెందిన శాస్త్రవేత్తలు ఒక రకమైన ప్రోటీనును అడ్డుకోవడం ద్వారా పార్కిన్సన్స్‌ వ్యాధిని అడ్డుకోవచ్చని తమ పరిశోధనల్లో గుర్తించారు. ఇటీవలే కనుగొన్న టిగర్‌ అనే ప్రోటీన్‌ను అడ్డుకోవడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. డాక్టర్‌ ఒలివర్‌ బాండ్‌మన్‌ నేతృత్వంలోని పరిశోధకుల బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించారు. ఈ వ్యాధి ఎక్కువయ్యే కొద్దీ నాడీకణాలు చనిపోతుంటాయి. ఆ సమయంలో టిగర్‌ ప్రోటీన్‌ను నిరోధిస్తే నాడీకణాలు చనిపోకుండా ఉంటాయని, దానిద్వారా ఈ వ్యాధి పెరుగుదలను అడ్డుకోవచ్చని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. తమ అధ్యయనంలో భాగంగా వారు జీబ్రాచేపలపై పరిశోధన నిర్వహించారు. తమ పరిశోధన ఫలితాల ఆధారంగా పార్కిన్సన్స్‌కు కొత్త ఔషధాలను తయారుచేసే అవకాశం ఉందని బాండ్‌మాన్‌ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News