: ఆస్పత్రి నుంచి వినోద్ కాంబ్లీ డిశ్చార్జ్
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ముంబైలోని లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. గత నెల 29న చెంబూర్ నుంచి బాంద్రా వెళుతుండగా ట్రాఫిక్ లో వినోద్ కాంబ్లీ అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దాంతో, హుటాహుటిన మహిళా ట్రాఫిక్ పోలీసు ఆస్పత్రికి తరలించడంతో నాలుగు రోజుల పాటు కాంబ్లీ చికిత్స పొందాడు. డిశ్చార్జ్ అనంతరం కాంబ్లీ మాట్లాడుతూ.. 'నేను తిరిగి ఇంటికి చేరుకున్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. నా ఆరోగ్యం కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని పేర్కొన్నాడు.