: జగన్ కు అపాయింట్ మెంట్.. మరి బాబుకెందుకివ్వరు: మోత్కుపల్లి
వరుస చార్జిషీట్లలలో ముద్దాయిగా పేర్కొన్న జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రధాని ఆపాయింట్ మెంట్ ఇవ్వకపోవడాన్ని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తప్పుపట్టారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై అభ్యంతరాలను చెప్పేందుకు వెళ్లిన టీడీపీ అధినేతకు ప్రధాని మన్మోహన్ సింగ్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం తెలుగు జాతిని అవమానించడమేనని అన్నారు. వరుస తుపానులతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయినా కన్నెత్తి చూడని ప్రధాని.. కనీసం ప్రజల గోడు చెప్పుకునేందుకైనా అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు.