: నెలవారీ జీతాలు చెల్లిస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్!
ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ తన యాక్టివ్ కార్యకర్తలకు, అనుబంధ సభ్యులకు కూడా నెలవారీ జీతాలు చెల్లిస్తున్నట్లు ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ఢిల్లీ డిస్ట్రిక్ కోర్టుకు సమర్పించిన చార్జ్ షీటులో పేర్కొంది. 1990లో రెండు నుంచి మూడువేల ఉన్న వేతనం ప్రస్తుతం అంటే 2011 నుంచి పది నుంచి 12వేలకు పెరిగిందని తెలిపింది. ముజాహిదీన్ చీఫ్ సయద్ సలాహుద్దీన్, మిగతా తొమ్మిది మంది సభ్యులు పాకిస్థాన్ నుంచి రూ.80 కోట్ల నిధులు స్వీకరించారని, వాటితో ఇండియాలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చార్జ్ షీట్ లో వెల్లడించింది. అంతేగాక నిధుల నుంచి నెలవారీగా జీతాలు కూడా తీసుకున్నారని చెప్పింది. కోర్టు కేసుల కోసం కూడా ఈ నిధులనే ఉపయోగించేవారని వివరించింది. చార్జ్ షీట్ ను పరిశీలించిన కోర్టు జడ్జి ఐఎస్ మెహతా తదుపరి విచారణను ఈ నెల ఏడుకు వాయిదా వేశారు.