: నిలకడగా బొత్స ఆరోగ్యం
తీవ్ర అస్వస్థతతో కేర్ ఆసుపత్రిలో చేరిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ మేరకు కేర్ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. హై బీపీ, తీవ్రమైన తలనొప్పితో బొత్స ఆసుపత్రిలో చేరారని తెలిపారు. నిపుణులైన గుండె, నరాల వైద్యుల పర్యవేక్షణలో బొత్సకు చికిత్స చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.