: 13,388 కొత్త ఉద్యోగాలకు మంత్రి వర్గం ఆమోదముద్ర
రాష్ట్ర ప్రభుత్వం మరో కొలువుల జాతరకు పచ్చ జెండా ఊపింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 13 శాఖల్లో మొత్తం 13,388 కొత్త ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వీటిలో ఐసీడీఎస్ లో 8,900, అటవీశాఖలో 3,820 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ కొత్త ఉద్యోగాల భర్తీతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 2,400 కోట్ల అదనపు భారం పడనుంది.