: వీడిన మహేష్ బ్యాంక్ చోరీ మిస్టరీ.. బ్యాంకు అప్రైజరే దొంగ
హైదరాబాద్, ఏయస్ రావు నగర్ లో గత నెల 29న జరిగిన మహేష్ బ్యాంకు చోరీ మిస్టరీ వీడింది. ఈ చోరీకి పాల్పడింది బ్యాంక్ అప్రైజర్ బ్రహ్మాచారి, అతని భార్య, కుమారుడని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. వారి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారి వద్ద నుంచి రూ. 4.5 కోట్ల విలువైన 15 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడే ముందు వారు సీసీ కెమెరాను ఆఫ్ చేశారని కమిషనర్ తెలిపారు.