: కేటీపీఎస్ లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ 11వ యూనిట్ ఇవాళ మధ్యాహ్నం ట్రిప్ అయింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. యూనిట్ లోని బాయిలర్ ట్యూబ్ లీక్ కావడంతో ఈ సమస్య తలెత్తింది. చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో అధికారులు మరమ్మతు పనులను చేపట్టారు.