: హైదరాబాద్ రంజీ క్రికెట్ సెలెక్షన్స్ లో అక్రమాలు


హైదరాబాద్ రంజీ సెలెక్షన్స్  మరోసారి వివాదాస్పదమయ్యాయి. రంజీ ట్రోఫీలో పాల్గొనే జట్టు ఎంపికల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని యువ ఆటగాళ్లు ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం తీరు మారాలంటూ ఈ రోజు ఇందిరా పార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో హెచ్ సీఏ సీనియర్ సెలెక్షన్ కమిటీ సభ్యుడు టి. పవన్ కుమార్ సహా పలువురు క్రికెటర్లు పాల్గొన్నారు. ఎంపికల్లో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న హెచ్ సీఏ కార్యదర్శి ఎంవీ శ్రీధర్ ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఇక సమస్యల పరిష్కారానికి లిఖితపూర్వక హామీ ఇవ్వాలని దీక్ష వేదిక వద్దకు వచ్చిన హెచ సీఏ ఉపాధ్యక్షుడు వినోద్ కు స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News