: రేపు విజయవాడలో టీడీపీ మహాధర్నా
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా రేపు విజయవాడలో టీడీపీ మహాధర్నా నిర్వహించనుంది. ఈ ధర్నాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటారని ఆ పార్టీ నేత కోడెల శివప్రసాదరావు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, బ్రిజేష్ కుమార్ తీర్పు వల్ల 4 టీఎంసీల నీరు అదనంగా వచ్చిందని మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడటం అవగాహనా రాహిత్యమని అన్నారు. తీర్పువల్ల 14 జిల్లాల్లో తాగు, సాగు నీటికి, విద్యుదుత్పత్తికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని కోడెల ఆందోళన వ్యక్తం చేశారు.