: హత్య కేసులో మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యేకు జీవితఖైదు


1990 నాటి హత్య కేసులో మహారాష్ట్రలోని ఉల్హన్ సాగర్ మాజీ ఎమ్మెల్యే సురేష్ అలియాస్ పప్పు కలాని (65) సహా నలుగురిని దోషులుగా సెషన్స్ కోర్టు నిర్ధారించింది. ఘనశ్యామ్ భటిజా అనే వ్యక్తి 1990 ఫిబ్రవరి 27న ఉల్హన్ సాగర్ లోని పింటో రిసార్టులో హత్యకు గురయ్యారు. ఈ హత్యను చూసిన ఘనశ్యామ్ సోదరుడు ఇందర్ భటిజా 1999 ఏప్రిల్ 27న హత్యకు గురయ్యారు. ఈ రెండు హత్యలూ దీర్ఘకాల రాజకీయ శతృత్వం కారణంగా జరిగినవేనని పోలీసులు కోర్టుకు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సురేష్ ఈ హత్యకు కుట్రదారుడిగా కోర్టు నిర్ధారించింది. అలాగే, బచ్చి, బాబా, మొహమ్మద్ హత్యకు పాల్పడినట్లుగా తేలుస్తూ.. నలుగురికీ జీవిత ఖైదు విధించింది.

  • Loading...

More Telugu News