: గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి కోసం త్వరలో భూసేకరణ: మంత్రి గంటా
గన్నవరం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ క్రమంలో విమానాశ్రయాన్ని విస్తరించనున్నట్టు తెలిపారు.
అందుకు 492 ఎకరాల భూమి అవసరమవుతుందని చెప్పారు. రూ. 92 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నామని, త్వరలో రూ. 72 కోట్లు విడుదల చేస్తామని అన్నారు. ఐటీ శాఖ మంత్రి పొన్నాలతో కలిసి గంటా ఈ రోజు విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.