: వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం: సీఎం కిరణ్
వికలాంగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆయన మాట్లాడుతూ వికలాంగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. వికలాంగులు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు మరిన్ని సంస్కరణలు తీసుకువస్తున్నామని తెలిపారు.
వికలాంగులకు అతి తక్కువ వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని సీఎం కిరణ్ చెప్పారు. వికలాంగులను సాధారణ వ్యక్తులు పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం 50 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తోందని... అయితే వికలాంగుల్ని వికలాంగులే చేసుకుంటే ఆదుకునే పథకాలు లేవని, అందుకే తాము వికలాంగులు వికలాంగుల్నే పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వికలాంగుల సంక్షేమ పథకాల పరిథిని పెంచుకుంటూ వెళ్తామని సీఎం తెలిపారు.