: విభజన ఆపేందుకే రాయల తెలంగాణ ప్రతిపాదన: కోదండరాం
రాష్ట్ర విభజనను ఆపేందుకే కాంగ్రెస్ పార్టీ రాయల తెలంగాణ ప్రతిపాదనను లేవనెత్తిందని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం విమర్శించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాయల తెలంగాణకు ఇరు ప్రాంతాల ప్రజలు అనుకూలంగా లేరని అన్నారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణను తీసుకువచ్చే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నేతలదేనని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.