: బీరు, బిర్యానీ పార్టీలకు ఓటేస్తే జైలే గతి: నారా లోకేశ్


ప్రలోభాలకు లొంగి మోసపోవద్దని యువతకు నారా లోకేశ్ హితవు పలికారు. బీరు, బిర్యానీ పార్టీలకు ఓటేస్తే ఆ పార్టీ నాయకుల్లాగే జైలే ప్రాప్తిస్తుందని లోకేశ్ వివరించారు. 'పల్లె పల్లెకు తెలుగుదేశం' ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన చిత్తూరు జిల్లాలోని రామకుప్పం, శాంతి పురం మండలాల్లో పర్యటించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు పాలన వస్తే రైతులకు మహర్దశే అని చెప్పారు. కొత్తగా సౌరశక్తితో పంపులు ప్రవేశపెట్టాలని బాబు తలపోస్తున్నారని లోకేశ్ అన్నారు. కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన లోకేశ్, ఉచిత విద్యుత్ అని ప్రకటించి, సరఫరా లేకుండా చేశారని విమర్శించారు. 

  • Loading...

More Telugu News