: విజయవంతమైన పృథ్వి-2 క్షిపణి పరీక్ష


ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన క్షిపణి, పృథ్వి-2ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా చాందీపూర్ నుంచి దీన్ని ప్రయోగించారు. ఓ సైనిక స్థావరం నుంచి దీన్ని వరుసగా మూడోసారి విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు చెప్పారు. ఇంతకు ముందు అక్టోబర్ 7, 8 తేదీల్లో ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బాలిస్టిక్ క్షిపణి రేంజి 350 కిలోమీటర్లు. ఇది 500 కిలోల బరువున్న అణు వార్ హెడ్ లను మోసుకెళ్లగలదు. 483 సెకండ్లలోనే 43.5 కిలోమీటర్ల ఎత్తుకు ఈ క్షిపణి వెళ్తుంది. ప్రయోగం నూటికి నూరుశాతం విజయవంతమయిందని, ప్రధాన లక్ష్యాలన్నింటినీ చేరిందని టెస్టు రేంజి డైరెక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ చెప్పారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్.ఎఫ్.సి.) ఈ పరీక్షను నిర్వహించిందన్నారు.

  • Loading...

More Telugu News