: ధోనీకి ఎల్జీ పీపుల్స్ చాయిస్ అవార్డు
భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్రసింగ్ ధోనీ ఎల్జీ పీపుల్స్ చాయిస్ అవార్డు గెలుచుకున్నారు. సచిన్ తర్వాత ఈ అవార్డును గెలుచుకున్న రెండో భారత క్రికెట్ ఆటగాడు ధోనీయే. ధోనీ తరఫున ఈ అవార్డును బీసీసీఐ సెక్రటరీ సంజయ్ పాటిల్ ఎల్జీ కంపెనీ ఉన్నతాధికారి హోవార్డ్ లీ నుంచి స్వీకరించారు. ఈ అవార్డును తొలిసారిగా సచిన్ 2010లో గెలుచుకున్నాడు. 2011, 2012లో ఈ అవార్డు శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కరను వరించగా.. ఈ ఏడాదికి ధోనీ ఇందుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది అవార్డు కోసం ఆస్ట్రేలియా కు చెందిన మైఖేల్ క్లార్క్, ఇంగ్లండ్ కు చెందిన అలాస్టెయిర్ కుక్, భారత ఆటగాడు విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికాకు చెందిన డీవిలియర్స్ పోటీ పడ్డారు.