: సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేత పిటిషన్ కొట్టివేత
సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 1984లో ఢిల్లీలోని సుల్తాన్ పురి ప్రాంతంలో చోటుచేసుకున్న అల్లర్లలో సజ్జన్ ప్రమేయం ఉందని, ఆయనపై విచారణ కొనసాగించాలని ఢిల్లీకోర్టు జులైలో ఆదేశించింది. ఈ నేపథ్యంలో సజ్జన్ కుమార్ పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.