: ఆర్టికల్ 370ని రద్దు చేయాల్సిందే: వెంకయ్య నాయుడు
ఆర్టికల్ 370ని రద్దు చేయాల్సిందేనని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ఆర్టికల్ 370 ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనదని అన్నారు. అందుకే ఆ ఆర్టికల్ ను రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370పై బీజేపీ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని, తాము అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేస్తామని వెంకయ్యనాయుడు తెలిపారు.