: 'జైహో' ట్రైలర్ ను విడుదల చేసిన సల్మాన్
రొటీన్ కు భిన్నంగా.. సల్మాన్ ఖాన్ 'జైహో' చిత్ర ట్రైలర్ ను అభిమానుల సమక్షంలో ఈ రోజు ముంబైలోని చందన్ థియేటర్ లో విడుదల చేశారు. సల్మాన్, టబు, ఓంపురి తదితరులు నటించిన ఈ చిత్రం జనవరి 24న విడుదల కానుంది. దీనికి సోహైల్ ఖాన్ దర్శకత్వం వహించారు. మీడియా సమక్షంలో కంటే అభిమానుల సమక్షంలో థియేటర్ లో విడుదల చేయడం వల్ల వారి ప్రత్యక్ష స్పందనను తెలుసుకునే అవకాశం ఉంటుందనే ఈ మార్గాన్ని ఆశ్రయించినట్లు చిత్ర ప్రతినిధి ఒకరు తెలిపారు.